ఆసిఫాబాద్‌కు చెందిన మనోజ్ అనే వ్యక్తి నుంచి 29 లక్షలు, మంచిర్యాలకు చెందిన అక్కినపల్లి రవీందర్ నుంచి 98 వేలు, మరో వ్యాపారి తిరుపతి నుంచి 2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
సంబంధిత నగదును ఎన్నికల అధికారికి అప్పగించామని డీసీపీ సుదర్శన్ గౌడ్ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో సరైన ఆధారాలు చూపితే నగదును వారికి అప్పగిస్తామని లేనిచో కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఒక వ్యక్తి రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణించరాదని తెలిపారు.
ఇవీ చూడండి:సీఎంను ప్రకటించిన కౌన్సిలర్... అవాక్కైన మంత్రి..!