మంచిర్యాల జిల్లా తాండూరులో పలు అభివృద్ధి పథకాలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. రేచిని గ్రామంలో ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్‌ను ప్రారంభించారు.
![mla durgal chimneys](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-adb-81-25-startdumpingyard-av-ts10030_25092020123335_2509f_1601017415_200.jpg)
తెలంగాణ ప్రభుత్వం.. గ్రామసీమలు అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటోందని ఎమ్మెల్యే అన్నారు. దేశంలోనే తెలంగాణ పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రణయ్ కుమార్, జడ్పీటీసీ సభ్యుడు బానయ్య, పలువురు సర్పంచులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి..