ETV Bharat / state

కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - మంచిర్యాల జిల్లా తాజా వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే దివాకర్​ రావు అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని పలు మండలాల్లో లబ్ధిదారులకు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

author img

By

Published : Sep 12, 2020, 9:40 PM IST

మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్​ నస్పూర్​, లక్సెట్టిపేట, దండేపల్లి మండల్లోని సుమారు వెయ్యి మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే దివాకర్​ రావు చెక్కులు అందజేశారు.

ప్రభుత్వ పథకాలు తీసుకోవడంలో దళారులను ఆశ్రయించవద్దని... చెక్కులు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు డిమాండ్​ చేస్తే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. కరోనా సమయంలోను సాయం అందిస్తోన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.