Minister KTR participated in Road Show at Mancherial : కాంగ్రెస్ హయాంలో కరెంటు ఉంటే వార్త.. అదే బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆ కరెంటు పోతే వార్త అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. గతంలో విద్యుత్ కావాలని అడిగినం.. అర్ధరాత్రి జాగారం చేసిన దుస్థితిని ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్‌ఎస్ రోడ్‌షో(BRS Road Show) ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేశారు.
దరిద్య్ర నేస్తం.. కాంగ్రెస్ హస్తం అంటూ మంత్రి కేటీఆర్ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీలు మాట్లాడితే దిల్లీ, టికెట్ కావాలంటే దిల్లీ వెళ్లాలన్నారు. అలాంటప్పుడు దిల్లీ పార్టీలు తెలంగాణలో ఎందుకని ఓటర్లను ప్రశ్నించారు. ఒకసారి మీరు ఆలోచించండి.. లేకపోతే మీరు వేసే ఓటు దిల్లీకి వెళుతుంది.. మళ్లీ అరిగోస తప్పదంటూ హితవు పలికారు.
BRS Road Show at Mancherial : ఎన్నికలు అనగానే అన్ని పార్టీలు వస్తాయి.. ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటేయాలని(Vote) ఓటర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు. సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు అడగానికి వస్తున్నారన్నారు. గతంలో ఖానాపూర్ నియోజకవర్గం ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండని అన్నారు. రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఇస్తుంటే.. రేవంత్ రెడ్డికి కరెంటు కనిపించడం లేదా ఒకసారి ఆ తీగను పట్టుకుంటే దరిద్య్రం వదిలిపోతుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఇది అమాయక కర్ణాటక కాదు - తెలివైన తెలంగాణ : కేటీఆర్
Telangana Election Polls 2023 : నక్సలైట్లు అని పోలీసులు కొట్టిన రోజులను ఓటేసే ముందు గుర్తు తెచ్చుకోవాలని.. గురువారం చిదంబరం వచ్చి తామే చంపినం సారీ అంటే తప్పు ఒప్పు అవుతుందా అంటూ కేటీఆర్ ఆవేదన చెందారు. తెలంగాణను పాతాళానికి తొక్కిందే కాంగ్రెస్ పార్టీ అని.. అలాంటి పార్టీకి ఓటేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క ఛాన్స్ అడుగుతోందని.. కానీ వారికి 11 అవకాశాలు ఇచ్చామని గుర్తు చేశారు.
డిసెంబరు 3న బీఆర్‌ఎస్‌దే విజయం : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దిల్లీ నేతలను నమ్ముకుంటే.. బీఆర్‌ఎస్ ప్రజలను నమ్ముకుందని మంత్రి కేటీఆర్ వివరించారు. సన్యాసి పార్టీల మాటలకు మోసపోకండి.. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఖానాపూర్‌ను దత్తత తీసుకుంటానని మాట ఇచ్చారు. కడెం రిజర్వాయర్(Kadem Project) సామర్థ్యాన్ని పెంచామన్నారు. బోగస్ ముచ్చట్లు.. బోగస్ సర్వేలు.. మళ్లీ బీఆర్‌ఎస్‌నే ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, రమేశ్ రాథోడ్ చెప్పినట్లు జన్‌ధన్ పైసలు వస్తే బీజేపీ ఓటేయాలని.. రాకపోతే బీఆర్‌ఎస్‌కే ఓటేసి గెలిపించాలని కోరారు. తన తల నరికినా ఫర్వాలేదని.. కానీ దిల్లీ పెద్దల ముందు మాత్రం తలలు వంచమని స్పష్టం చేశారు.
మా ధైర్యం తెలంగాణ ప్రజలు - బీఆర్ఎస్ను వాళ్లే కాపాడుకుంటారు : మంత్రి కేటీఆర్