మంచిర్యాల జిల్లాలో మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ తయారీ యంత్రాల ఉచిత సేవలను ప్రారంభించారు. కరోనా బాధితుల కోసం ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే 10 యంత్రాలను కొనుగోలు చేసి సేవలను ప్రారంభిస్తున్నామని సంఘం జిల్లా అధ్యక్షుడు పవన్ తివారి తెలిపారు. ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయిన కరోనా బాధితుల కోసం ఈ సేవలను ఉచితంగా అందించడం సంతోషంగా ఉందని వైద్యుడు రమణ తెలిపారు. మెరుగైన వైద్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నప్పటికీ... కొందరికీ అందడం లేదని అన్నారు.
సాయం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని పోలీసు అధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రమణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఒకే రోగిలో బ్లాక్, వైట్ ఫంగస్ గుర్తింపు