మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆయన విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఈ మేరకు ఆమె మొక్కలు నాటారు.
మంచిర్యాల జిల్లా గత పాలనాధికారి ప్రస్తుత ఖమ్మం జిల్లా పాలనాధికారి ఆర్ వీ కర్ణన్ విసిరిన ఛాలెంజ్‌ను సైతం స్వీకరించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మామిడి మొక్కను నాటి గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు.