ETV Bharat / state

మున్సిపల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం - మున్సిపల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

మందమర్రి మున్సిపల్​ కార్యాలయాన్ని జిల్లా పాలనాధికారి భారతి హోళీకేరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ ఆవరణలో చెత్త ఉండడాన్ని చూసి అధికారులపై మండిపడ్డారు.

manchirial collector fire on muncipal officers in mandhamarri
మున్సిపల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
author img

By

Published : Jun 10, 2020, 4:58 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ కార్యాలయాన్ని జిల్లా పాలనాధికారి భారతి హోళీకేరి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయం ఆవరణలో నర్సరీని పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో పచ్చదనం కనిపించకపోవడం, ఎక్కడపడితే అక్కడ చెత్త ఉండడం పట్ల కలెక్టర్ మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ ఇల్లు అయితే ఇలాగే ఉంచుతారా అంటూ ప్రశ్నించారు. పట్టణ ప్రగతి హరితహారానికి సంబంధించిన వివరాలను మున్సిపల్ కమిషనర్ రాజును అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

ఇవీ చూడండి: కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నారు: కె. లక్ష్మణ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.