ETV Bharat / state

Suspension: మంచిర్యాల సబ్​రిజిస్ట్రార్​ సస్పెన్షన్​ - మంచిర్యాల సబ్​ రిజిస్ట్రార్​ను సస్పెండ్ చేసిన అధికారులు

లేఅవుట్​ నిబంధనలు ఉల్లంఘించి ప్లాట్లు చేసిన వ్యవహారంలో మంచిర్యాల సబ్​ రిజిస్ట్రార్​ అధికారి సస్పెన్షన్​కు గురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకున్నారు.

mancherial sub registrar suspend after victims complaint to higher authorities
మంచిర్యాల సబ్​రిజిస్ట్రార్​ సస్పెన్షన్​
author img

By

Published : Jun 16, 2021, 3:16 PM IST

మంచిర్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయం సబ్ రిజిస్ట్రార్ అధికారి అప్పారావును మంగళవారం ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అప్పారావు గత మార్చి ఒకటిన ఇక్కడ సబ్ రిజిస్ట్రార్​గా బాధ్యతలు చేపట్టారు. మందమర్రి మండలం తిమ్మాపూర్ శివారులో 847 గజాల భూమిని లేఅవుట్ నిబంధనలు ఉల్లంఘించి మూడు ప్లాట్లుగా విభజించి రిజిస్ట్రేషన్ చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు అధికారులు నిబంధనలు బేఖాతరు చేసినట్లు గుర్తించి చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్​ సీనియర్​ అసిస్టెంట్​ మురళిని ఇన్​ఛార్జ్ సబ్​రిజిస్ట్రార్​గా నియమించారు.

ఇదీ చూడండి: నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.