శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఈసెట్ ఫలితాల్లో మంచిర్యాల జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. రాష్ట్రస్థాయిలో 2, 3 ర్యాంకులు సాధించి ప్రతిభ కనబర్చారు. బెల్లంపల్లి పట్టణంలోని రడగంబాల బస్తీకి చెందిన ఎండీ. తాజ్ 142 మార్కులు సాధించి.. రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచారు.
తాండూరు మండలం బోయపల్లి గ్రామానికి చెందిన పుర్ర రాజేశ్ రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించాడు. అతను 141 మార్కులు తెచ్చుకున్నాడు. చదువుల్లో రాణించాలనే ఉద్దేశంతో కరోనా సెలవులు వృథా చేయకుండా రోజుకు పది గంటలు చదివి సత్తా చాటాడంటూ విద్యార్థి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండిః తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల