ETV Bharat / state

రైతు గోస: అధికారులకు లంచం ఇవ్వడానికి భిక్షాటన

భూరికార్డులు సర్వే చేయకుండా రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు సహకరిస్తున్నారని మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో ఓ రైతు ఆరోపించాడు. రెవెన్యూ అధికారులు, కలెక్టర్​పై ఆరోపణలు చేస్తూ ఫ్లెక్సీతో నిరసన వ్యక్తం చేశాడు.

Farmer begging to bribe officials
అధికారులకు లంచం ఇవ్వాలని రైతు భిక్షాటన
author img

By

Published : Dec 26, 2020, 2:48 PM IST

మంచిర్యాల జిల్లా తాండూరుకు చెందిన తౌటం రాజేంద్రప్రసాద్ అనే రైతు 2010లో సర్వే నంబర్ 612/అ/5లో 3.42 సెంట్ల భూమి, 612/6/ఆలో 4.58 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. సరిహద్దులో ఉన్న భూకబ్జాదారులు తనకు తెలియకుండా 3.24 ఎకరాల భూమిని ఆన్​లైన్​లో వారి పేరుకు మార్చుకున్నారని రాజేంద్రప్రసాద్ ఆరోపించాడు. దీనికి రెవెన్యూ అధికారులు సహకరించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

అధికారులకు లంచం ఇవ్వాలని రైతు భిక్షాటన

గతంలో జిల్లా కలెక్టర్​తో పాటు స్థానిక తహసీల్దార్​కు విన్నవించినా స్పందించలేదని రైతు రాజేంద్ర ప్రసాద్ వాపోయాడు. అధికారులంతా కుమ్కక్కై తన భూమి తనకు కాకుండా చేశారని మండిపడ్డాడు. అవినీతి విషయంలో అధికారులంతా ఒక్కటేనని ఆరోపిస్తూ ఫ్లెక్సీతో నిరసన వ్యక్తం చేశాడు. లంచం ఇస్తేనైనా తన భూమి తనపేరిట పట్టా చేస్తారేమోనని భిక్షాటన మొదలుపెట్టాడు. భూ కబ్జాదారులు తనను బెదిరిస్తున్నారని, ప్రభుత్వం జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.