ETV Bharat / state

మందుబాబులు బీ కేర్‌ఫుల్.. ఆసుపత్రిలో శ్రమదానం చేయాలని కోర్టు తీర్పు - Mancherial district Court latest news

మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు పదే పదే చెబుతున్నా.. కొందరు పెడచెవిన పెడుతున్నారు. తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. మత్తులో విహరిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇలాంటి వారికి కనువిప్పు కలిగేలా మంచిర్యాల జిల్లా కోర్టు భిన్నమైన తీర్పునిచ్చింది. అదెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Mancherial district
Mancherial district
author img

By

Published : Jan 22, 2023, 8:12 PM IST

మొన్నటి దాక మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే జరిమానాలు విధించడం.. వాహనాలు సీజ్ చేయడం.. కోర్టులో కౌన్సిలింగ్ ఇవ్వడం చూసే ఉంటాం. కానీ దీనికి భిన్నంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిపై మంచిర్యాల న్యాయస్థానం వినూత్న తీర్పునిచ్చింది. తాజాగా 13 మందిని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని శుభ్రం చేయాలని మంచిర్యాల జిల్లా మొదటి తరగతి న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

నిబంధనలను ఉల్లఘించి పలు మార్లు పట్టుబడినా వారిలో మార్పు రాకపోవటంతో ఈ శిక్ష విధించారు. రెండు రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరోగ్య కేంద్రంలో శుభ్రత పనులు చేయాలని లేదంటే పది రోజుల సాధారణ జైలు శిక్ష విధించాలని తెలిపారు. న్యాయమూర్తి ఉపనిషత్‌ వాణి తీర్పుతోనైనా మందు బాబులకు మార్పు రావాలని ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు.

మద్యం సేవించి వాహనాలు నడపరాదని నిబంధనలు ఉన్నప్పటికీ చాలామందిలో మార్పు రావడంలేదని ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తమతోపాటు ఎదుటివారు కూడా బలవుతున్నారనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. ఈ తీర్పుతో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిలో కనువిప్పు కలుగుతుందని ఆయన వివరించారు.

ఇటీవల జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తనిఖీల్లో దొరికకుండా ఉండేందుకు పలువురు అడ్డదారుల్లో వెళ్తున్నట్లు గుర్తించిన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారికి ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసినా వారిలో మార్పు రావడం లేదని చెబుతున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో వారికి మందు తాగి నడపటం వల్ల జరిగే దుష్పరిణామాల గురించి వివరించినా.. పలువురు అప్పుడు తప్పు తెలుసుకున్నట్లు నటిస్తున్నారని.. తరువాత వారి ప్రవర్తన షరామామూలే. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించే అంశాన్ని ఉన్నతాధికారులు కూడా పరిశీలిస్తున్నారు.

"మద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా చాలా మందికి మార్పు రావడం లేదు. ఈ తీర్పుతో అయినా వారు మారుతారని భావిస్తున్నాం." - సురేందర్, మంచిర్యాల ట్రాఫిక్ ఎస్ఐ

మందుబాబులు బీ కేర్‌ఫుల్.. శ్రమదానం చేయాలని కోర్టు తీర్పు

ఇవీ చదవండి: బీఆర్‌ఎస్‌ పూర్తిగా దివాలా తీసిన కంపెనీ: బండి సంజయ్‌

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ టార్గెట్ అదేనా..? అందుకే వారికి దూరంగా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.