రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిరిన హరిత సవాల్‌ను స్వీకరించిన మంచిర్యాల జిల్లా డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి డీసీపీ కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు.
రాష్ట్రం హరితవనంగా మారాలనే సంకల్పంతో సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొదలుపెట్టారని డీసీపీ తెలిపారు. 10 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యంలో... ఇప్పటి వరకు 4 కోట్ల మొక్కలు నాటడం పూర్తయిందని వెల్లడించారు. ప్రతిఒక్కరు హరిత సవాల్లో భాగస్వాములైతే రాష్ట్రం హరితవనంగా మారుతుందన్నారు.