కారణాలు చెప్పకుండా గ్రామాల్లో పనులు పూర్తి చేసి చూపించాలని మంచిర్యాల కలెక్టర్ భారతి హోళ్లీ కేరి అన్నారు. తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, అధికారులతో శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు, ప్రకృతి వనాలపై విడి విడిగా సమావేశం నిర్వహించారు. వీటిని గడువులోగా పూర్తి చేయలేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సెప్టెంబరు ఒకటవ తేదీ లోగా నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. తాండూరు మండలంలోని కొత్తపల్లి, త్రి ఇంక్లైన్ సర్పంచులతో హామీ పత్రం రాయించుకున్నారు.
ఇదీ చదవండి: ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్