మంచిర్యాల జిల్లా భీమారంలో జిల్లా కలెక్టర్ భారతి హోల్ళికేరి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా నిర్వహిస్తున్న తన్వి మద్యం దుకాణానికి వెళ్లారు. ఆవరణలో అపరిశుభ్రం, ప్లాస్టిక్ వ్యర్థాలు చూసి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్యం దుకాణం యజమానికి 20 వేల రూపాయల అపరాధ రుసుము విధించాలని పంచాయతీ అధికారులకు ఆదేశించారు. తగిన జాగ్రత్తలు తీసుకుని, శుభ్రం పాటించాలని దుకాణం యజామానికి సూచించారు. మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
ఇదీ చూడండి: బావిలో పడిన గజరాజు- జోరుగా సహాయక చర్యలు