కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు సామాన్య ప్రజలు బత్రికే విధంగా లేవని మంచిర్యాల జిల్లా ఆటో డ్రైవర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ముఖేశ్ గౌడ్ ఆరోపించారు. పెరిగిన డీజిల్, పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలో యూనియన్ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. పట్టణంలోని పలు వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు.
ఆటో డ్రైవర్లను ఆర్ధికంగా నష్టపరిచే మోటారు వాహనాల చట్టం- 2019ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ముఖేశ్ గౌడ్ తెలిపారు. రోజురోజుకు పెరిగిపోతున్న డీజిల్, పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలు సామాన్య ప్రజలపై భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి ప్రజలపై భారం పడకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: బడ్జెట్ సమావేశాలు, సంబంధిత అంశాలపై నేడు సీఎం సమీక్ష