మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం నాయికినిపేట గ్రామశివారులోని పాలసముద్రం, జిల్లెడు మొక్కలపై వందల సంఖ్యలో మిడతలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం సాయంత్రం మిడతలను గమనించిన గ్రామ సర్పంచ్ భర్త హనుమంతు మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లారు.
మహారాష్ట్ర ప్రాణహిత సరిహద్దుకు ఈ గ్రామం కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల మిడతలు వచ్చాయేమోనన్న అనుమానం అన్నదాతల్లో ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మిడతలు వచ్చాయని హునుమంతు తెలిపారు. మిడతలు ఉన్న ప్రదేశానికి వెళ్లి పరిశీలిస్తామని వ్యవసాయ అధికారి శ్రీకాంత్ వెల్లడించారు.
- ఇవీ చూడండి: తీరాన్ని తాకిన నిసర్గ తుపాను.. గాలుల బీభత్సం