ఆ హంతకులను కఠినంగా శిక్షించాలి: న్యాయవాదులు - తెలంగాణ వార్తలు
హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ మంచిర్యాల కోర్టు సముదాయంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. లాయర్ల రక్షణకు బిల్లు తేవాలని డిమాండ్ చేస్తూ రహదారిపై రాస్తారోకో చేశారు.
హత్య చేసిన హంతకులను శిక్షించాలి: న్యాయవాదులు
మంచిర్యాల కోర్టు సముదాయంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ రహదారిపై రాస్తారోకో చేశారు.
హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు, నాగమణిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎంతటివారినైనా అరెస్టు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పోలీసులతో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. లాయర్ల రక్షణకు బిల్లు తేవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: న్యాయవాదుల హత్యను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు