ETV Bharat / state

బెల్లంపల్లిలో పేట్రేగిపోతున్న భూమాఫియా - land mafia

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భూ అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.  ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో కబ్జాలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ అధికారులు కబ్జాలను కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదు.

బెల్లంపల్లిలో పేట్రేగిపోతున్న భూమాఫియా
author img

By

Published : Nov 16, 2019, 8:05 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామశివారులో ఉన్న ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోంది. రాజకీయ పలుకుబడితో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. కబ్జా చేయడంతోపాటు ప్లాట్లుగా విక్రయించి పేదలకు అంటగడుతున్నారు. రాష్ట్ర రహదారిని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో కబ్జాలపై ఉక్కుపాదం మోపిన తహసీల్దార్ శ్రీనివాస్ ఇటీవల సెలవులో ఉండడం వల్ల కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కబ్జాల వ్యవహారం తెరపైకి రావడంతో తహసీల్దార్ శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. కోర్టుకు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని కూడా ఆక్రమించే ప్రయత్నం చేశారని తహసీల్దార్ స్వయంగా చెప్పడం విస్తుగొల్పుతోంది. గతంలో ప్రభుత్వ భూముల విషయంలో కన్నాల గ్రామ సర్పంచ్ హత్యకు కూడా గురయ్యారు. అధికారులు స్పందించి ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

బెల్లంపల్లిలో పేట్రేగిపోతున్న భూమాఫియా

ఇవీ చూడండి: మక్క చేనులో ముమైత్​, తమన్నా

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్:9949620369
tg_adb_81_16_bhookabjalu__avb_ts10030
ఖాళీ కనిపిస్తే కబ్జా
...బెల్లంపల్లిలో పెరిగిపోతున్న భూకబ్జాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భూ అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో కబ్జాలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ అధికారులు కబ్జాలను కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదు.
* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుంది. రాజకీయ పలుకుబడితో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా అక్రమిస్తున్నారు. కబ్జా చేయడంతోపాటు ప్లాట్లుగా విక్రయించి పేదలకు అంటగడుతున్నారు. రాష్ట్రీయ రాజ రాష్ట్రీయ రహదారి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కబ్జాల పై ఉక్కుపాదం మోపిన తహసీల్దార్ శ్రీనివాస్ ఇటీవల సెలవులో ఉండడంతో మళ్లీ కబ్జాలకు శ్రీకారం చుట్టారు. కబ్జాల వ్యవహారం తెరపైకి రావడంతో తహసీల్దార్ శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను కాపాడాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కావడం లేదు . అధికార పార్టీ అండదండలు మెండుగా ఉండటం, దొంగ పత్రాలతో కోర్టులకు వెళ్లడంతో కబ్జాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది. కోర్టుకు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని కూడా ఆక్రమించే ప్రయత్నం చేశారని తహసీల్దార్ స్వయంగా చెప్పడం విస్తుగొల్పుతుంది.
* పెట్రేగి పోతున్న భూ మాఫియా
బెల్లంపల్లి పట్టణంతోపాటు మండల శివారులో ఉన్న ప్రభుత్వ భూములను భూ మాఫియా ఆక్రమించుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారూ. రానురాను భూ మాఫియా ఆగడాలు అదుపు తప్పుతున్నాయి. గతంలో ప్రభుత్వ భూముల విషయంలో కన్నాల గ్రామ సర్పంచ్ హత్యకు కూడా గురయ్యారు. అధికారులు స్పందించి ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Body:బైట్
శ్రీనివాస్, తహసీల్దార్, బెల్లంపల్లి

Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.