మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఓడ్డు సోమనపల్లిలో వాటర్‌ట్యాంకు మీద చిక్కుకుపోయిన ఇద్దరు రైతులను ప్రభుత్వ విపత్తు నిర్వహణ యంత్రాంగం రక్షించింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హెలికాప్టర్ తెప్పించి.. వారి ప్రాణాలను కాపాడారు.
తమ పశువుల కోసం నిన్న సాయంత్రం ఆ ఇద్దరు రైతులు పొలాల వద్దకు వెళ్లగా తిరుగు ప్రయాణంలో గోదావరి నది ప్రవాహం చుట్టు ముట్టింది. దీంతో బయటకు రాలేక వాటర్‌ట్యాంకు ఎక్కి ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అక్కడ చేరుకున్న ఎమ్మెల్యే... కేటీఆర్‌కు విషయం తెలిపారు. ఆయన ఆదేశంతో ప్రభుత్వ విపత్త నిర్వహణ యంత్రంగం... హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌ను రప్పించి ఇద్దరిని సురక్షితంగా ఓడ్డుకు చేర్చారు. రైతులని రక్షించినందుకు గ్రామస్థులు ప్రజలు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: