మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఏటా కార్తిక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తిక పౌర్ణమి జాతర జరుగుతుంది. వేడుకలో పాల్గొనేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. కార్తిక పౌర్ణమి జాతరలో భాగంగా ఆలయ నిర్వాహకులు సత్యనారాయణ స్వామి వ్రతము జరిపిస్తారు. సుమారు 2000 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతంలో పాల్గొంటారని ఆలయ అర్చకులు తెలిపారు.
ఇదీ చూడండి: లాభాలకు 'బంతి' పూల బాట