గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి వరద ఉద్ధృతి గంటగంటకు పెరుగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి 190.96 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి చేరుకోగా... 7.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లకుగానూ 142.3 మీటర్లు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయానికి ఎల్లంపల్లి జలాశయంలో 13 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ప్రస్తుతం కేవలం 7.6 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని అధికారులు స్పష్టం చేశారు. నీటి ప్రవాహం కొనసాగుతున్నందున ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
ఇవీ చూడండి : పలకాబలపం పట్టేస్తా... ఆడుతుపాడుతు తిరిగేస్తా...