ETV Bharat / state

భారీగా నిషేధిత గ్లైపోసెట్ గడ్డి మందు స్వాధీనం - రామగుండం సీపీ సత్యనారాయణ

రాష్ట్రంలో నిషేధం విధించిన గ్లైపోసెట్ గడ్డి మందు అమ్ముతున్న కంపెనీ యజమానులతో పాటు డీలర్లను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

నిషేధిత గడ్డి మందు అమ్ముతున్న నిందితులు అరెస్ట్
author img

By

Published : Jul 27, 2019, 12:01 AM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును రామగుండం సీపీ సత్యనారాయణ పరిశీలించారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో నిషేధిత గ్లైపోసెట్ గడ్డి మందును అమ్ముతున్న నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ గడ్డి మందు వినియోగం వల్ల భూసారం తగ్గి పంటల దిగుబడి తగ్గుతుందని పేర్కొన్నారు. మందమర్రి మండలం నెన్నెలకు చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఈ మందును తీసుకొచ్చి రైతులకు అమ్ముతున్నాడనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనంతరం 250 లీటర్ల హైజాక్ గ్లైపోసెట్ గడ్డి మందును పట్టుకున్నారు.
నిందితుడి నుంచి రాబట్టిన సమాచారం మేరకు హైదరాబాద్​లో గల ఇంసెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ గోదాంలో సోదాలు నిర్వహించారు. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 14,370 లీటర్ల హైజాక్ గ్లైఫొసెట్​ను సీజ్ చేసి మంచిర్యాలకు తరలించామన్నారు. మొత్తం 16 వేల లీటర్లు సీజ్ చేశామని స్పష్టం చేశారు. వీటి విలువ సుమారు 85 లక్షల వరకు ఉంటుందన్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, ఒక వాహనాన్ని సీజ్ చేశామన్నారు.

నిషేధిత గడ్డి మందు అమ్ముతున్న నిందితులు అరెస్ట్

ఇవీ చూడండి : 'మాయ మాటలు చెప్పి... నా కూతుర్ని ఎత్తుకెళ్లాడు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.