ETV Bharat / state

అంబా అని అరిచినా పట్టించుకోని మనిషి.. పరుగున వచ్చి ఓదార్చిన తోటి ఆవులు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

Heart Breaking Incident Of Cows Accident Mancherial : మనిషి కన్నీళ్లను తోటి మనుషులే తుడవని ఈ కాలంలో.. అంబా అంటే నేను ఉన్నా నేస్తమా అని గాయపడిన ఆవు దగ్గరకు వచ్చాయి తోటి ఆవులు. తీవ్ర గాయాలైన ఆవును చూసి రోదించాయి. కానీ అటుగా వెళ్లిన మనిషి కాస్త సాయం కూడా చేయలేదు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ఇవాళ వేకువజామున జరిగింది. వాహనం ఢీకొని రెండు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. ఒకటి మరణించగా.. రెండు కాళ్లు విరిగి అచేతనంగా మారిపోయింది. ఆ రెండు ఆవుల వద్దకు చేరిన మరికొన్ని మూగజీవాలు రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

Cows
Humane Aspect in Cows
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2023, 1:22 PM IST

Updated : Sep 9, 2023, 2:45 PM IST

Heart Breaking Incident Mancherial అంబా అని అరిచినా పట్టించుకోని మనిషి.. పరుగున వచ్చి ఓదార్చిన తోటి ఆవులు

Heart Breaking Incident Of Cows Accident Mancherial : ఈరోజుల్లో ఎవరికైనా ఏమైనా జరిగితే.. మనకెందుకులే అని సంబంధం లేకుండా ఉంటారు చాలా మంది. ఇక రోడ్డు పక్కన ఎవరైనా ప్రమాదం జరిగి మృతి చెందినా, గాయపడినా.. అటువైపు నుంచి వెళ్లే సాటి మనుషులు కనీసం వాళ్లను పట్టించుకోకుండా.. మనకెందులే అని సంబంధం లేకుండా తప్పుకొని వెళుతున్నారు. ఇలాంటి విషయాలు రోజూ వార్తల్లో బోలెడు చూస్తుంటాం. అయ్యో పాపం ఎవరైనా సాయం చేస్తే బాగుండేది కదా అని ఆ క్షణానికి ఓ కన్నీటి బొట్టును కారుస్తాం. మనిషిలో రోజురోజుకూ అహం పెరిగిపోయి.. మానవత్వం నశించిపోతోంది. తోటివారు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా కాస్త జాలి చూపలేకుపోతున్నారు నేటి జనం.

Cows Accident Mancherial Today : ఎంతో తెలివైన మనుషుల కంటే.. ఇప్పుడు పశువులే కాస్త నయంగా ఉన్నాయి. వాటికి మానవత్వం అంటే ఏంటో తెలియకపోయినా.. తోటిజీవులు బాధపడుతుంటే అవి కూడా కన్నీళ్లు కారుస్తాయి. ఇలాంటి సంఘటనే మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ ఆవు మృతి చెందగా.. మరో ఆవు కాళ్లు విరిగిపోయిన అచేతనంగా పడి ఉంది. ఆ దారిలో వెళ్తున్న వాళ్లెవరూ ఆ పశువులను పట్టించుకోలేదు. కానీ అటుగా వెళ్తున్న తోటి ఆవులు.. ఈ ఆవు అనుభవిస్తున్న నరకాన్ని చూశాయి. దాని దగ్గరకు వచ్చి.. మేమున్నాం నేస్తమా అంటూ అండగా నిలిచాయి. కాళ్లు విరిగి బాధతో ఆ ఆవు ఏడుస్తుంటే.. దాని బాధను చూసి ఈ ఆవులు కూడా కంటతడి పెట్టడం చూస్తే ఎంత కఠిను హృదయాలైనా కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే.

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో వేకువ జామున వాహనం ఢీకొని రెండు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. రహదారి పక్కనే పడి రెండు ఆవులు నరకయాతన అనుభవిస్తున్నాయి. అటువైపు నుంచి వెళ్లే ఏ వాహనదారుడు కూడా వాటి పరిస్థితిని చూసిన పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. కానీ ఓ యువకుడు మాత్రం వీటి పరిస్థితిని చూసి టోల్​ ఫ్రీ నంబర్​ 1962కు ఫోన్​ చేసిన.. అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ యువకుడు కూడా ఏం చేయలేని పరిస్థితిలో అక్కడి నుంచి దిగాలుగానే వెళ్లిపోయాడు. సరైన సమయానికి వైద్యం అందక.. రెండు ఆవుల్లో ఒక ఆవు గాయాలతో కొట్టుమిట్టాడుతూ మరణించింది.

Cow Died in Road Accident Mancherial : వేకువజామున అటుగా వచ్చిన మున్సిపల్​ సిబ్బంది.. మరణించిన ఆవును గుర్తించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. కానీ రెండు కాళ్లు విరిగి ఉన్న ఆవును మాత్రం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అక్కడే రోడ్డు పక్కనే ఉన్న మిగతా ఆవులు అన్నీ కలిసి ఒక్కొక్కటిగా గాయాలైన ఆవు వద్దకు చేరుకున్నాయి. అచేతనంగా పడి ఉన్న ఆవును తమ నాలుకలతో నిమురుతూ.. బాధ పడొద్దనే సంకేతాన్నిస్తూ ఓదార్చుతున్నాయి. ఆ ఆవును చూసి మిగిలినవి కూడా దిగాలుగా అక్కడే ఉండిపోయాయి. మూగజీవాలు తన తోటి జీవికి కష్టం వస్తే వాటి చుట్టూ చేరి తిరుగుతూ రోదిస్తున్న తీరు.. అక్కడి ఉన్న స్థానికులను కంటతడి పెట్టించింది.

పాలు పితికే యంత్రంతో కరెంట్ షాక్- 11 ఆవులు మృతి

గోశాలలో 24 ఆవులు మృతి.. గ్రామస్థుల ఆందోళన

Last Updated : Sep 9, 2023, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.