మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం పెద్దపేట గ్రామ సచివాలయంలో గ్రామస్తులకు ఆరోగ్య శాఖ అధికారులు దోమ తెరలు పంపిణీ చేశారు. వర్షాకాలంలో దోమలు వ్యాపించే అవకాశం ఉంది. సీజనల్ వ్యాధులు వ్యాపించి ప్రజలు అనారోగ్యం పాలవకుండా గ్రామస్తులకు దోమతెరలు పంపిణీ చేస్తున్నట్టు ఎంపీపీ శ్రీనివాస్ తెలిపారు.
ప్రజలంతా దోమల వల్ల వ్యాధులు వ్యాపించకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఇళ్లలో, గుంతల్లో నీరు నిల్వ ఉంటే తొలగించాలని సూచించారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ఆకలి చావుల్లేవు: హైకోర్టు