రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఆరో విడత కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో 200 పండ్ల మొక్కలను రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ నాటారు.
మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి , ఏసీపీ నరేందర్ తదితర పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దివాకర్ రావు హాజయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రమంతా పచ్చదనంతో సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంపై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
నీటిని కొంటున్నాం, గాలిని కూడా కొనుక్కునే పరిస్థితి రావద్దని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సూచించారు.
ఇదీ చదవండి: నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్