ETV Bharat / state

డంపింగ్​ యార్డులా మారిన గోదావరి నది

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని  గోదావరి  పరివాహక  ప్రాంతం... చెత్త డంపింగ్ యార్డ్​లా మారింది. పురపాలక  సిబ్బంది చెత్తను డంప్ చేయడానికి  గోదావరి  తీరాన్ని  చక్కగా వాడుకున్నారు. గోదావరినదిలో వ్యర్థాలను ఏరివేయాల్సిన అధికారయంత్రాంగమే గోదావరి పవిత్రతకు భంగం కలిగిస్తోంది. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై స్థానికులు మండిపడుతున్నారు.

డంపింగ్​ యార్డులా మారిన గోదావరి నది
author img

By

Published : Aug 9, 2019, 3:23 PM IST

Updated : Aug 9, 2019, 5:01 PM IST

డంపింగ్​ యార్డులా మారిన గోదావరి నది
పవిత్ర గోదావరి నది ఇప్పుడు కలుషితమవుతోంది. గోదావరి నీటిలో బ్యాక్టీరియా, ప్రమాదకర రసాయనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలో చెత్త డంపు యార్డుకు స్థలం కేటాయించకపోవడం వల్ల మున్సిపాల్టీ అధికారులు గోదావరినది పరివాహక ప్రాంతాన్నే డంపు యార్డు కింద మార్చేశారు. మున్సిపాల్టీ అధికారుల ఆదేశంతో సిబ్బంది.. ఆస్పత్రుల నుంచి సేకరించిన ప్రమాదకర వ్యర్థాలను గోదావరి ఒడ్డున పడేస్తున్నారు. ఒడ్డుకు వెళ్లినవారికి చెత్తా చెదారాలతో కుళ్లిన వాసన వస్తోంది. సీస ముక్కలు వంటివి గుచ్చుకుంటున్నాయి. ప్రభుత్వం నదీ జలాల పరిరక్షణకు సంబంధించి కనీస చర్యలు చేపట్టడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

పురపాలక సిబ్బంది కాళేశ్వరం జలాలు రాకముందు తొలగించాల్సిన చెత్తను నీరు వచ్చిన తర్వాత జేసీబీల సాయంతో తీస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గోదావరి నీటిని ఎంతో పవిత్రంగా భావించే ఇక్కడి ప్రజలకు.. పాలకులు, పురపాలక అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం ఆందోళన చెందేలా చేస్తున్నది. శ్రావణమాసంలో గోదావరికి పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్యస్నానం ఆచరించే భక్తులు ఇక్కడి పరిస్థితిని చూసి నిరాశ చెందుతున్నారు.

ఇవీ చూడండి: హైదారాబాద్​ ఎంఎంటీఎస్​కు 16 ఏళ్లు

Intro:TG_ADB_11D_08_GODARAMMA GOSHA_PKG_TS10032Body:ఫైల్ నేమ్ : TG_ADB_11B_08_GODARAMMA GOSHA_PKG_TS10032

రిపోర్టర్ : సంతోష్ మైదం, మంచిర్యాల......

యాంకర్ పార్ట్ :
గోదావరిలో నిండా మునిగి స్నానం చేస్తే పాపాలు పోతాయి అనేది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు స్నానం చేస్తే చర్మరోగాలు వచ్చే అవకాశాలు మాత్రం కచ్చితంగా ఉన్నాయి... అత్యంత పవిత్రంగా భావించే గోదావరి కలుషితం కావడం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది.మంచిర్యాల జిల్లా కేంద్రం లోని గోదావరి పరివాహక ప్రాంతం అంతా చెత్త డంపింగ్ యార్డ్ ల్లా మారాయి.పురపాలక సిబ్బంది చెత్తను డంప్ చేయడానికి గోదావరి తీరాన్ని చక్కగా వాడుకున్నారు .. గోదావరి నీటినే తాగునీటిగా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వాడుతుంటారు.. ఇక మున్సిపాల్టీలు, పంచాయితీల్లో సర్కారే గోదావరి నుంచి తాగునీటిని సరఫరా చేస్తోంది.. గోదావరినదిలో వ్యర్ధాలను ఏరివేయాల్సిన అధికారయంత్రాంగమే గోదావరి పవిత్రతకు భంగం కలిగిస్తోంది... గోదావరి నది కలుషితంపై ఈటీవి కథనం .....

వాయిస్ః
ప్రపంచ నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే పురుడుపోసుకొన్నాయి. జీవజాలం ఉనికి, విస్తృతి, అభివృద్ధీ నీటిమీదే ఆధారపడి ఉన్నాయి. ఎడారిలో గొంతు తడారిపోతున్న జీవికి కావాల్సింది చుక్కనీరే తప్ప, వేరే సంపదలేవీ కాదు. నీటిని నీలిబంగారమని ఊరకే అనలేదు. వాస్తవంలో బంగారంకంటే అదే అమూల్యం. ప్రాణావసరమైన నీరే పలుచోట్ల విషతుల్యమై ప్రాణాలు తీస్తోంది. ఇంతకుమించిన ప్రమాదం మరేదైనా ఉంటుందా? ముఖ్యంగా భారతీయ సంస్కృతికి, సామాజిక జీవనానికి, ఆర్థిక వ్యవస్థకూ జీవనాడి లాంటి నదులు కాలుష్య కాసారాలవుతున్న తీరు భయాందోళనలు కలిగిస్తోంది... పవిత్ర గోదావరినది ఇప్పుడు కలుషిత మవుతోంది. గోదావరి నీటిలో బ్యాక్టీరియా, ప్రమాదకర రసాయనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కలుషితం అవుతున్న గోదావరి జలాలను సేవిస్తున్న అనేక మంది ప్రజలు వివిధ రోగాలబారిన పడుతున్నారు. గోదావరి నదిలో కాలుష్యం కోరలు చాస్తోంది.ప్రభుత్వం నదీజలాల పరిరక్షణకు సంబంధించి కనీస చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి..

బైట్ : చంద్ర శేఖర్ , భక్తుడు ,హమలివాడ (TG_ADB_11b_08_GODARAMMA GOSHA_PKG_TS10032.)
బైట్ : శ్రీనివాస్ ,మంచిర్యాల (TG_ADB_11B_08_GODARAMMA GOSHA_PKG_TS10032.)
వాయిస్ః మంచిర్యాల పురపాలక సంఘం పరిది లో చెత్త డంపు యార్డుకు స్ధలం కేటాయించకపోవడంతో మున్సిపాల్టీ అధికారులు ఏకంగా గోదావరినది పరివాహక ప్రాంతాన్నే డంపు యార్డుకింద మార్చేసారు.. గోదావరి నదిలో పండుగల సందర్భంగా ఎంతో మంది స్నానాలు ఆచరించి పూజలు నిర్వహించుకునేందుకు గోదావరికి వెళ్తుంటారు.ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో భక్తులు చాలామంది గోదావరి లో పుణ్య స్నానాలు చేయడానికి వస్తున్నారు... మున్సిపాల్టీ అధికారుల ఆదేశం తో సిబ్బంది వేసిన చెత్తనుఅసుపత్రిలను నుంచి సేకరించిన చెత్త చూసి ముక్కు మూసుకుంటున్నారు..ఒడ్డున చెత్తా చెదారాలతో సీసముక్కలు లాంటివి అక్కడకు వెళ్లిన వారికి కుచ్చుకుంటున్నాయి. పుష్కరఘాట్‌కు దగ్గరగా గోదావరి నీరు చేరినా పుణ్యస్నానాలు ఆచరించలేని పరిస్థితి. పూర్తిగా చెత్తచెదారం పేరుకుపోయింది. కొంతమంది ప్రమాదకరంగా గోదావరి మధ్యలోకి వెళ్లి స్నానమాచరిస్తున్నారు.

బైట్ : ఇంద్ర రాణి ,మంచిర్యాల (TG_ADB_11a_08_GODARAMMA GOSHA_PKG_TS10032.)

గోదావరి ఎదురీదుతూ నది చివరి వరకు నీరు చేరిందని సంతోషించాలో.. ఇక్కడ వేసిన చెత్తను కలుపుకొని కలుషితమవుతోందని బాధపడాలో అర్థంకాని పరిస్థితి.చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్లు
పురపాలక సిబ్బంది కాళేశ్వరం జలాలు రాకముందు తోలిగించలిసిన చెత్త ను జలాలు వచ్చిన తరువాత jcbల సాయం తో తొలిగించిన పలితం శూన్యం ..ఈ నీటిని ఎంతో పవిత్రంగా భావించే ఇక్కడి ప్రజలు పాలకులు, పురపాలక అధికారులు చేస్తున్న నిర్లక్ష్యానికి ఆందోళన చెందుతున్నారు. పుణ్యజలాన్ని కాస్త చెత్తచెదారంతో నింపి అపవిత్రం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రావణమాసంలో గోదావరికి పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్యస్నానమాచరించే భక్తులు ఇక్కడి పరిస్థితిని చూసి నిరాశ చెందుతున్నారు.

బైట్ః వెంకన్న , మంచిర్యాల
(TG_ADB_11C_08_GODARAMMA GOSHA_PKG_TS10032.)

బైట్ః ఆంజనేయులు , మంచిర్యాల
(TG_ADB_11D_08_GODARAMMA GOSHA_PKG_TS10032.)

ఎండ్ వాయిస్ : ఈ మాసంలో చేసే పూజలు మొదట గోదావారి జలంతో స్నానంచేసి ప్రారంభిస్తారు. అత్యంత పవిత్రంగా భావించి నెల మొత్తం నోములు, వ్రతాలు చేసుకుంటారు. అలాంటిది గోదావరిని చూస్తేనే భయపడిపోతున్నారు. చెత్తతో నిండుకున్న నీటిని చూసి స్నానం చేసేందుకు ఆలోచిస్తున్నారు. ఊరిలో ఉన్న చెత్తను మొత్తం తీసుకొచ్చి గోదావరిని కలుషితం చేశారంటూ మండిపడుతున్నారు. పాలకులు ఇప్పటికైనా నదీతీరంలో శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Conclusion:
Last Updated : Aug 9, 2019, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.