మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కల గుట్ట గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. ఆదివాసీలు తమ ఆరాధ్య దైవంగా భావించే గాంధారి మైసమ్మను దర్శించుకునేందుకు వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి పూలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
మైసమ్మను జడ్పీ ఛైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఐటీడీఓ పీఓ భవిష్ మిశ్రా దర్శించుకున్నారు. గాంధారి ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. జాతరలో ఆదివాసీల నృత్యాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి: వేడెక్కుతున్న రాష్ట్రం... రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు