మంచిర్యాలకు చెందిన సుహర్ష అమెరికాలోని ప్రతిష్ఠాత్మక అబర్న్ విశ్వవిద్యాలయంలో సీటు సాధించారు. ఈ విషయం తెసుకున్న మాజీ ఎంపీ కవిత సుహర్షను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభినందించారు. తెలంగాణ బిడ్డలు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించడం హర్షణీయమన్నారు. సుహర్షకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. సుహర్షతో పాటు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. సుహర్ష మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కవిత ఆకాంక్షించారు.
అమెరికాలో ఉన్నత చదువు అభ్యసించిన కవిత తన జ్ఞాపకాలను సుహర్షతో పంచుకున్నారు. మిస్సిస్సిప్పిలో ఎంఎస్ చదువుకున్న కవిత, అప్పుడు 500 డాలర్లు స్టైఫండ్ పొందినట్లు తెలిపారు. ప్రస్తుతం సుహర్ష సీటు సాధించిన అలబామా పక్కన ఉండే మిస్సిస్సిప్పి నగరంలోనే తాను నివసించానని అక్కడి పరిస్థితులను సుహర్షతో పంచుకున్నారు. తాను కవితకు పెద్ద అభిమాని అని సుహర్ష పేర్కొన్నారు. కవిత ఫోన్ చేసి అభినందించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఇదీ చూడండి: వినాలంటే కొండెక్కాల్సిందే.. టెంట్ వేయాల్సిందే!