ETV Bharat / state

కొవిడ్​ ఆస్పత్రికి 30 ఆక్సిజన్ సిలిండర్లు అందించిన మాజీ మంత్రి - మాజీ మంత్రి గడ్డం వినోద్​ సాయం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కొవిడ్ ఆస్పత్రికి మాజీ మంత్రి గడ్డం వినోద్​ 30 ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బందిని సన్మానించారు.

Telangana news
బెల్లంపల్లి వార్తలు
author img

By

Published : Jun 2, 2021, 1:55 PM IST

కొవిడ్​ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం చేయాలని మాజీ మంత్రి గడ్డం వినోద్​ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కొవిడ్​ ఆస్పత్రికి 30 ఆక్సిజన్​ సిలిండర్లు అందించారు. రెండు అంబులెన్సులను కొవిడ్ రోగుల కోసం ఆస్పత్రికి అప్పగించారు.

అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ కల సాకారం అయిందని మాజీ మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్​కు తెలంగాణ విషయంలో తన తండ్రి వెంకట స్వామి సంపూర్ణ సహకారం అందించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.సూరిబాబు, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ కారుకూరి రామచందర్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Harish rao: అమరవీరులకు మంత్రి హరీశ్‌ రావు నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.