మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కల్వరి చర్చి వద్ద కర్రలతో వెళ్తున్న లారీలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. లారీ ఇంజన్ భాగంలో మంటలు వ్యాపించాయి. రాష్ట్రీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనంలో కర్రలు ఉండటం వల్ల ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించారు.
ఇవీ చూడండి : ఇంటిముందు చెత్త వేయొద్దు అన్నందుకు దాడి