30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అధికారులు గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అవి పాటించని వారికి వెంటనే జరిమానా విధిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట పంచాయతీ రసూల్పల్లిలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లో ఉన్న చెత్తడబ్బాను వాడలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇంటి ముందున్న రోడ్డుపైన చెత్త వేశారు. ఫలితంగా శంకరమ్మ, బండి స్వర్ణకార్, కనకయ్యలకు ఒక్కొక్కరికి రూ.ఐదు వందల చొప్పున జరిమానా విధించినట్లు ఎంపీడీవో నాగేశ్వర్రెడ్డి, కార్యదర్శులు రామకృష్ణ, శివకృష్ణ వివరించారు.

ఇదీ చదవండిః యురేనియం నిక్షేపాలున్నా... అనుమతివ్వం: కేటీఆర్