Corona: కరోనా కాటు: 20 రోజుల్లో తండ్రి కొడుకు బలి - Corona deths
కొవిడ్ కాటుకు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. అయిన వాళ్లను అర్ధాంతరంగా దూరం చేస్తూ తీరని విషాదాన్ని నింపుతోంది. తాజాగా మంచిర్యాల జిల్లాలో కరోనా సోకి.. తండ్రీకొడుకులు మరణించడం ఆ కుటుంబాన్ని విషాదంలో పడేసింది.
కరోనాతో తండ్రి కొడుకు మృతి
కొవిడ్ మహమ్మారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. మహమ్మారి వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 20 రోజుల వ్యవధిలో ఓ కుటుంబంలో తండ్రి కొడుకులు మృతి చెందడం విషాదాన్ని నింపింది. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం(కె) గ్రామానికి చెందిన భూషణంతో పాటు ఆయన కుమారుడు సునీల్ కరోనా సోకి 20 రోజుల వ్యవధిలోనే చనిపోయారు. మొదట తండ్రికి కరోనా సోకగా మృతి చెందాడు. ఆ తర్వాత కుమారుడికి సోకింది. చికిత్స పొందుతూ అతడు కూడా మృతి చెందాడు. భూషణం సింగరేణి కార్మికుడిగా పని చేస్తున్నాడు.