మంచిర్యాల జిల్లాలోని గోదావరి తీరంలో వైభవంగా జరిగిన శ్రీ సమ్మక్క సారలమ్మల జాతర శనివారంతో ముగిసింది. నాలుగు రోజుల పాటు భక్తుల నిత్య పూజలు అందుకున్న దేవతలు శనివారం తిరిగి వన ప్రవేశం చేశారు. కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవార్లను కోయ పూజారులు సంప్రదాయ పద్ధతిలో గద్దెల నుంచి వనానికి చేర్చారు. ఫలితంగా జాతరకు ముగింపు పలికినట్లు అయ్యింది.
నాలుగు రోజుల పాటు జరిగిన ఈ జాతరకు జిల్లా నుంచే కాకుండా.. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఇవీచూడండి: పిల్లలను విక్రయిస్తున్న ముఠా పట్టివేత