బ్యాంకింగ్ రంగం నుంచి వచ్చే లాభాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని బ్యాంకు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని చూస్తున్న కేంద్రం తీరును నిరసిస్తూ.. దేశ వ్యాప్తంగా బ్యాంకు యూనియన్ సంఘాలు తలపెట్టిన రెండు రోజుల సమ్మెలో భాగంగా మంచిర్యాల జిల్లాలో ఉద్యోగులు తమ విధులు బహిష్కరించారు. ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వరంగ బ్యాంకులు పేద, మధ్యతరగతి ప్రజలకు చేరువగా ఉండి అనేక సేవలు అందిస్తున్నాయని ఉద్యోగులు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: కరోనా సంక్షోభంలో తెలంగాణ వ్యూహాత్మక అడుగులు: గవర్నర్