మంచిర్యాల జిల్లా కేంద్రంలో భాజపా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు గెలవకూడదని ప్రగతి భవన్ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని రఘునందన్‌రావు ఆరోపించారు. భాజపా ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతోందని అసత్య ప్రచారాలు చేస్తూ.. పట్టభద్రులను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. కేంద్రం సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తోందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటీకరణకు సంబంధించి పూర్తి ఆధారాలతో తాము మీడియా ముందుకు వస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకంలోనూ కేంద్రం వాటా ఉందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. హరితహారం పేరుతో మొక్కలు నాటి.. వాటిని సంరక్షించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు.
ఇదీ చూడండి: ఉద్యోగాల విషయంలో తెరాసకు చిత్తశుద్ధి లేదు: ఉత్తమ్