మంచిర్యాల జిల్లాలో ఆరోగ్య కార్యకర్త మృతికి... కొవిడ్ టీకా కారణం కాదని వైద్యశాఖ ప్రకటించింది. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లికి చెందిన అంగన్వాడీ ఆయా సుశీల శనివారం మృతిచెందారు. ఈనెల 19న ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆమె టీకా తీసుకున్నారు. రెండురోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో... తొలుత మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు.
పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుశీల శనివారం మృతి చెందారు. టీకా వేయడంతోనే చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన వైద్యశాఖ.. సుశీల మృతికి కొవిడ్ టీకా కారణం కాదని స్పష్టం చేసింది. గుండె, శ్వాస సంబంధిత సమస్యతో ఆమె చనిపోయారని వెల్లడించింది.
ఇదీ చదవండి: టీకా పంపిణీలో భారత్ సరికొత్త రికార్డులు