మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకి కొవిడ్-19 కేసులు ఉద్ధృతమవుతున్నాయి. ఒకేరోజు 33 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
జిల్లాలో 41 మంది నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించగా.. వారిలో 33 మంది వైరస బారిన పడినట్లు జిల్లా నోడల్ అధికారి డా.బాలాజీ తెలిపారు. బెల్లంపల్లి సింగరేణిలో పనిచేసే కార్మికుడి నుంచి 30 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. కరోనా బాధితులు అందరూ... ఓ పంచాయితీ ద్వారా వ్యాప్తి జరిగినట్లు అధికారులు తెలిపారు. బెల్లంపల్లిలో అధికారులు మూడు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్‌గా ఏర్పాటు చేసినప్పటికీ.. సత్ఫాలితాలను ఇవ్వలేదు. భౌతిక దూరం పాటిస్తూ... కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని సూచించారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో మరోసారి లాక్డౌన్..!