మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 98కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య1009కి చేరింది. రోజురోజూ పెరుగుతోన్న పాజిటివ్ కేసులతో జిల్లాలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అప్రమత్తమైన అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. కరోనా బాధిత ప్రాంతాల్లో రసాయన ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ప్రజల్లో నివారణ చర్యలపై అవగాహన పెంచుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండిః ఇరుకు ఇళ్లలోనే ఐసోలేషన్.. బాధితుల్లో మస్తు పరేషాన్!