ETV Bharat / state

ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం - ఆ ఆయుధాన్ని డబ్బుకు అమ్ముకోవద్దు : కేసీఆర్ - BRS Praja Ashirwada Sabha

CM KCR Chennuru Praja Ashirwada Sabha Speech : ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని.. డబ్బుకు ఆ ఆయుధాన్ని అమ్ముకోవద్దని బీఆర్​ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఆలోచించి అభ్యర్థిని ఎన్నుకోవాలన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

brs election campaign i
CM KCR Chennuru Praja Ashirwada Sabha Speech
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2023, 3:27 PM IST

Updated : Nov 7, 2023, 7:52 PM IST

CM KCR Chennuru Praja Ashirwada Sabha Speech : ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇంకా పరిణతి రావాలని.. ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని బీఆర్​ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని.. డబ్బుకు ఓటును అమ్ముకోవద్దని సూచించారు. ఓటు వేసే ముందు అభ్యర్థి గుణగుణాలు తెలుసుకోవాలన్న సీఎం.. మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కాంగ్రెస్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు.

'ఓటర్లు పరిణితితో ఓటేస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుంది - సరిగ్గా వాడితే మంచి భవిష్యత్‌ ఉంటుంది'

BRS Praja Ashirwada Sabha : ఈ సందర్భంగా ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీనే అని కేసీఆర్ ఆరోపించారు. స్వరాష్ట్రం రాకముందు వరకు భయంకర పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. సింగరేణిలో 49 శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది హస్తం పార్టీ అని దుయ్యబట్టారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం యత్నిస్తోందని.. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నది భారత్ రాష్ట్ర సమితి అని కేసీఆర్ స్పష్టం చేశారు.

దీపావళి తర్వాత సీఎం కేసీఆర్ మూడో విడత ఎన్నికల ప్రచారం - ఈసారి ఏకంగా రోజుకు 4 నియోజకవర్గాల్లో సభలు

ఈ క్రమంలోనే రైతుబంధు ఆపాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అంటున్నారని.. రైతులకు 3 గంటల కరెంటు ఉండాలని రేవంత్‌ రెడ్డి చెబుతున్నారని కేసీఆర్ అన్నారు. భారతదేశంలో 24 గంటల కరెంట్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని చెప్పారు. ఎన్నికలు వచ్చాయంటే కాంగ్రెస్‌, బీజేపీ నేతలు వస్తారన్న ఆయన.. సంక్షేమ పథకాలు వద్దంటున్న కాంగ్రెస్‌ నేతలకు డిపాజిట్లు రాకుండా ఓడించాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. డబ్బుకు ఓటు అమ్ముకోవద్దు. మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఓటు వేసే ముందు అభ్యర్థి గుణగుణాలు తెలుసుకోవాలి. తెలంగాణ రాకముందు వరకు భయంకర పరిస్థితులు ఉండేవి. రైతు బంధు ఆపాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. రైతులకు 3 గంటల కరెంటు ఉండాలని రేవంత్‌ రెడ్డి చెబుతున్నారు. ఎన్నికలు వచ్చాయంటే కాంగ్రెస్‌, బీజేపీ నేతలు వస్తుంటారు. సంక్షేమం కొనసాగాలంటే మరోసారి బీఆర్​ఎస్​ అధికారంలోకి రావాలి. - సీఎం కేసీఆర్

ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం ఆ ఆయుధాన్ని డబ్బుకు అమ్ముకోవద్దు కేసీఆర్

ప్రచారంలో కారు టాప్ గేర్​ - మూడోసారి అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీమ్ కేసీఆర్

కాంగ్రెస్‌కు దళితులపై ఉన్నది పెదవులపై ప్రేమే అని కేసీఆర్ విమర్శించారు. హస్తం పార్టీ ఏనాడూ అంబేడ్కర్ ఆశయాలను అమలు చేయలేదన్నారు. బీఆర్​ఎస్​ పార్టీ అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగిస్తోందని.. సీఎం, మంత్రులు కొలువు దీరే కార్యాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టామని గుర్తు చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం హైదరాబాద్‌లోనే ఉందని తెలిపారు. ఈ సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే బీఆర్​ఎస్​ అభ్యర్థి బాల్క సుమన్​ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

గుర్తుల గుర్తుంచుకో రామక్క - మా పార్టీని గుర్తుంచుకో రామక్క ప్రధాన పార్టీల నోట రామక్క పాట ఇప్పుడిదే టాప్ ట్రెండింగ్

Last Updated : Nov 7, 2023, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.