మంచిర్యాల జిల్లా జైపూర్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ వివేక్ కమల కండువా కప్పుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు భాజపాలో చేరారు. లక్ష్మణ్ కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు మోపుతున్నారని... వేదింపులకు గురిచేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీసులు చట్టానికి లోబడి పని చేసుకోవాలని... కేంద్రంలో తమ పార్టి అధికారంలో ఉందని గ్రహించాలని తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని లక్ష్మణ్ సూచించారు.
'మా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోం'
భాజపా ప్రజాప్రతినిధులను కానీ, కార్యకర్తలను కానీ పోలీసుల వేధింపులకు గురిచేస్తే ఊరుకోబోమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హెచ్చరించారు.