మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామంలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. వారు తమ ఇంటిలోనే ఉంటున్నారు. కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్‌కు ఫోన్ చేయడంతో భాజపా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథరావు.. అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. హోం ఐసోలేషన్ కిట్స్, ఆక్సీమీటర్, థర్మమీటర్, కరోనా నివారణ టాబ్లెట్లు, మాస్కులను ఆయన అందజేశారు. ఆ కుటుంబానికి తగు జాగ్రత్తలు తెలిపారు. జిల్లాలో ఎవరైనా కరోనా పాజిటివ్ పేషెంట్లు ఉన్నట్లయితే తాము ఏర్పాటు చేసిన 96767 33230 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
కరోనా సోకిన కుటుంబానికి భాజపా జిల్లా అధ్యక్షుడు సాయం - మంచిర్యాల జిల్లా వార్తలు
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామంలో కుటుంబానికి భాజపా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథరావు సాయం చేశారు. హోం ఐసోలేషన్ కిట్స్, ఆక్సీమీటర్, థర్మమీటర్, కరోనా నివారణ టాబ్లెట్లు, మాస్కులను ఆయన అందజేశారు.