మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ముల్కల, గుడిపేట గ్రామాల్లో రైతువేదిక భవనాల నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. రైతుసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో రైతువేదిక భవనాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. దీనిని ప్రతి కర్షకుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంటను నిల్వ చేసుకునేందుకు గోదాంలను ప్రతి మండలంలో 20 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
రైతేరాజు కావాలి:
తెరాస ప్రభుత్వం రైతేరాజు కావాలని రైతు సంక్షేమం కోసం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే దివాకర్ రావు వెల్లడించారు. మంచిర్యాల నియోజకవర్గంలోని రైతులకు ఎల్లంపల్లి నుంచి సాగునీరును అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రమంతా సస్యశ్యామలం చేయడం కోసం ప్రాజెక్టులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచం మెచ్చుకునేలా భారీ నీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిపక్షాలు జలదీక్ష చేస్తూ విమర్శిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: 24 గంటల్లో 11,458 మందికి కరోనా- 386 మంది బలి