ETV Bharat / state

Bullet Bandi Song: ఒక్క డ్యాన్స్​తో సెలబ్రిటీ అయిన వధువు.. వరుడికి అదిరిపోయే పెళ్లి కానుక - బుల్లెట్​ బండి పాటకు పెళ్లి కూతురు డ్యాన్స్​

అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి రోజుల్లో సెలబ్రిటీ కావాలంటే ఏళ్లు కావాలా...? ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే సెలబ్రిటీలైపోయిన ఎందరినో చూస్తుంటాం.. ఒక్క కన్నుగీటుతో ఏకంగా హీరోయిన్​ అయిపోయింది ప్రియావారియర్. అలాగే ఒక్క డ్యాన్స్​తో రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది ఓ నవ వధువు. గాయని మోహన భోగరాజు ఆలపించిన ఈ ‘బుల్లెట్‌ బండి...’యూట్యూబ్​లో సంచలనం సృష్టించిన విషయం తెలిసింది. అయితే ఇప్పుడు ఈ పాటకు తన స్టెప్పులతో మరింత క్రేజ్​ను తీసుకొచ్చింది నవ వధువు.

bride dance bullet bandi song dance
bride dance bullet bandi song dance
author img

By

Published : Aug 19, 2021, 9:51 PM IST

సాయి శ్రియ అశోక్​ల లగ్నపత్రిక
సాయి శ్రియ అశోక్​ల లగ్నపత్రిక

జీవితంలో పెళ్లి అంటే మాటలకందని మధురానిభూతి.. వివాహ ఘట్టంలో ప్రతి క్షణం ఆ దంపతుల మనోపలకంలో సువర్ణ అక్షరాలుగా నిలిచిపోతుంది. అందుకే ప్రతిక్షణాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటారు. జీవితంలో ఒకేసారి వచ్చే ఈ పండుగను మహదానందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మహిళలు... కోటి ఆశలతో తన జీవితంలోకి వచ్చే వ్యక్తికి ఆహ్వానం పలుకుతారు. ఈ సందర్భంలో వారి సంతోషం వారి కల్లలోను.. ప్రతి చేష్టలోను కనిపిస్తుంటుంది. అయితే మనువాడబోయేవాడిపై తనకున్న ఇష్టాన్ని ఓ వధువు డ్యాన్స్​ రూపంలో బయటపెట్టింది.

ఒక్క డ్యాన్స్​తో సెలబ్రిటీ అయిన వధువు

మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీశాఖ ఉద్యోగి రాము, సురేఖ దంపతుల కుమార్తె సాయి శ్రీయను... రామకృష్ణాపూర్​కు చెందిన ఆకుల అశోక్​తో ఈనెల 14న వివాహం జరిపించారు. వివాహనంతరం పెళ్లి బరాత్​ మొదలైంది. పెళ్లి కొచ్చిన అతిథిలు, స్నేహితులు డ్యాన్స్​ చేశారు. అప్పుడు మొదలైంది అసలు ట్విస్ట్​. తన జీవితంలోకి వచ్చినవాడిపై ఇష్టాన్ని, కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధాన్ని, అత్తింట్లో తన పాత్రను వివరిస్తూ " బుల్లెట్​ బండెక్కి వచ్చేత్తా పా..." పాటకు డ్యాన్స్ చేసి సర్​ప్రైజ్​ చేయడమే కాకుండా... మనువాడిన వాడి మనసు దోచుకుంది.

నవ వధువు వేసిన స్టెప్పుల వీడియోను మధ్యప్రదేశ్‌లో మార్క్‌ఫెడ్‌ ఎండీగా పని చేస్తున్న రామగుండానికి చెందిన ఐఏఎస్‌ అధికారి పి.నరహరి ట్వీట్‌ చేశారు. గాయని మోహన భోగరాజును ఆయన ట్యాగ్‌ చేయగా.. ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో సామాజికమాధ్యమాల్లో దూసుకుపోతోంది. యూట్యూబ్​లో లక్షల్లో వ్యూస్​ వస్తున్నాయి.

చాలా సంతోషంగా ఉంది. పాటకు డ్యాన్స్​ చేసి నేను నా భర్తను సర్​ప్రైజ్​ చేద్దామనుకున్నాను. కానీ అది కాస్త ఫేస్​బుక్​, యూట్యూబ్​లో పెట్టడంతో చాలా పాపులర్​ అయ్యింది. చాలా వ్యూస్​ వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. నాడ్యాన్స్​ను నా భర్తకు అంకితం ఇస్తున్నాను -సాయి శ్రీయ, నవ వధువు

భర్తను సర్​ప్రైజ్​ చేద్దామనుకుని చేసిన వీడియో కాస్త... తనకే సర్​ప్రైజ్​ ఇస్తున్న వేళ... నవ వధువు ఏమంటుందంటే... సరదాగా తన స్టేటస్​గా పెట్టుకున్న ఈ డ్యాన్స్​.. ఇప్పుడు చాలామంది వాట్సప్​, ఫేస్​బుక్​, ఇన్​స్టాగా మారిపోయింది. సాధారణంగానే పెళ్లి వీడియో చూసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. అందులోను ఇలాంటి ఆకట్టుకునే సన్నివేషాలు ఉంటే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ వీడియోపై పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక నెటిజన్లు తమ లైకులు, కామెంట్లతో నవ దంపతులపై అభినందనల జల్లు కురిపిస్తున్నారు.

ఇదీ చూడండి: Viral Video : 'బుల్లెట్ బండి' పాటపై వధువు డ్యాన్స్.. వరుడు ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.