తమ రక్షణ కోసం రూపొందించిన చట్టాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి హిమబిందు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల కోసం రూపొందించిన చట్టాలపై అవగాహన కల్పించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలో వివరించారు.

అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీఓ శ్యామల, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు లక్ష్మి, మందమర్రి సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇందులో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి.