కరోనా లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని నిరుపేదలకు చేయూతనందించేందుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి ముందుకువచ్చారు. మూడు రోజుల క్రితం కరోనా బాధితులకు పౌష్టికాహారం అందజేసిన సుమన్.. ఇప్పుడు పేదలకు నిత్యావసర సరుకులు అందించి మానవత్వం చాటుకున్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో పని లేక ఇబ్బందులు పడుతున్న 2000 మంది నిరుపేద కుటుంబాలకు తన సొంత ఖర్చులతో ఒక్కో కుటుంబానికి రూ. 1000 విలువైన సరుకులను సిద్ధం చేశారు. వాటిని ప్రత్యేక వాహనాల్లో ఆయా మండలాలకు తరలించారు. నియోజకవర్గ ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని సుమన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద భారీగా నిలిచిన వాహనాలు