సింగరేణి బొగ్గు బ్లాకుల్లో ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐదు జాతీయ కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న సమ్మె మూడోరోజు కూడా కొనసాగింది. చివరి రోజు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని గనుల వద్ద ఏఐటీయూసీ కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసించారు.
సింగరేణి వ్యాప్తంగా 41 బొగ్గు గనులను వేలం వేయాలనుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. తమ తోటి సింగరేణి కార్మికుల భవిష్యత్తు కోసం ఐక్య కార్మిక సంఘాలు ప్రైవేటీకరణ రద్దు చేసేవరకు పోరాడతామని తెలిపారు.