ETV Bharat / state

ప్రేమిస్తావా.. చస్తావా.. మంచిర్యాలలో యువకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య - Mancheryala District News

Young woman commits suicide in Mancharyala: మంచిర్యాల జిల్లా కొత్తమామిడిపల్లి గ్రామానికి చెందిన సాయిష్మ అనే యువతి.. ప్రేమ పేరుతో మానసిక క్షోభకు గురి చేస్తున్న యువకుడి వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స పొందుతూ ఈరోజు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మరణించింది.

ఆత్మహత్య
ఆత్మహత్య
author img

By

Published : Mar 20, 2023, 5:54 PM IST

Young woman commits suicide in Mancharyala: మహిళల రక్షణకు ప్రభుత్వం ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టినా వారిపై వేధింపులు ఆగడం లేదు. దేశంలో నిత్యం వారిపై శారీరకంగా, మానసికంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో చాలా చోట్ల వారిని వేధిస్తున్నారు. మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. తాజాాగా మంచిర్యాల జిల్లాలో ప్రేమ వేధింపులు తాళలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన నలిమేల వినయ్ కుమార్ అనే వ్యక్తి గత కొంతకాలంగా అదెే గ్రామానికి చెందిన ఎంబడి సాయిష్మను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకోవాలని పదేపదే ఆమెను వేధింపులకు గురి చేశాడు. యువతికి తనంటే ఇష్టంలేదని, నిశ్చితార్థం అయిందని ప్రేమ పేరుతో తన వెంటపడొద్దని కోరిన అతడు వినలేదు.. పదే పదే వెంటపడుతూ సాయిష్మను మానసిక క్షోభకు గురిచేశాడు. తనను ప్రేమించకపోతే, పెళ్లి చేసుకోకపోతే యువతి అంతు చూస్తానంటూ బెదిరించాడు.

దీంతో సాయిష్మ మనస్తాపానికి గురైంది. వేధింపులు తారాస్థాయికి చేరడంతో శనివారం సాయంత్రం పురుగుల మందు తాగింది. గమనించిన తల్లిదండ్రులు ఆమెను హుటాహుటిన కరీంనగర్​లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్​కు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ యువతి ఇవాళ మరణించింది. ఇటువంటి పరిస్థితి మరో ఆడకూతురుకి రాకూడదని, ఈ ఆత్మహత్యకు కారకుడు అయినటువంటి నలిమెల రామన్న కుమారుడు వినయ్​కుమార్​ను కఠినంగా శిక్షించాలని యువతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

"సాయిష్మ మాకు ఒక్కగానొక్క కూతురు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన నలిమేల రామన్న కుమారుడు నలిమెల వినయ్ కుమార్ అనే వ్యక్తి గత కొంతకాలంగా సాయిష్మను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.పెళ్లి చేసుకోవాలని పదేపదే ఆమెను వేధింపులకు గురి చేశాడు.సాయిష్మకి తనంటే ఇష్టంలేదని, నిశ్చితార్థం అయిందని ప్రేమ పేరుతో తన వెంటపడొద్దని కోరినా అతడు వినకుండా మానసికక్షోభకు గురిచేశాడు. తనను ప్రేమించకపోతే, పెళ్లి చేసుకోకపోతే అంతు చూస్తానంటూ బెదిరించాడు. దీంతో సాయిష్మ మనస్తాపానికి గురై శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇటువంటి పరిస్థితి మరో ఆడకూతురుకి రాకుడదు. ఈ ఆత్మహత్యకు కారకుడు అయినటువంటి నలిమెల రామన్న కుమారుడు వినయ్​కుమార్​ను కఠినంగా శిక్షించాలి". -యువతి తల్లిదండ్రులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.