ETV Bharat / state

'పింఛను కోసం వెళ్తే మరణించావని చెప్పారు'

author img

By

Published : Feb 13, 2021, 7:21 PM IST

అధికారుల నిర్లక్ష్యానికి ఈ సంఘటన అద్దం పడుతోంది. వృద్ధాప్య పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి చనిపోయినట్లుగా అధికారులు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్​ పురపాలిక కార్యాలయంలో అతను మరణించినట్లు రికార్డుల్లో నమోదైంది.

A man live but municipal officers declared as he was death in records in naspoor in mancherial district
మరణించినట్లు అధికారులు ఇచ్చిన పత్రాన్ని చూపిస్తున్న బాధతుడు

అధికారుల నిర్లక్ష్యం వృద్ధుని పాలిట శాపమైంది. అతను బతికుండగానే చనిపోయినట్లు పురపాలక అధికారులు నమోదు చేశారు. వృద్ధాప్య పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా రావడం లేదని బాధితుడు వాపోతున్నాడు. మంచిర్యాల జిల్లా నస్పూర్​ మండలం తీగల్​పహాడ్​ రాంనగర్​లో ఉంటున్న పూదరి చంద్రయ్య సింగరేణిలో పనిచేస్తూ పదవీ విరమణ పొందాడు.

ప్రస్తుతం ఆయన మంచిర్యాలలో నివాసముంటున్నారు. సింగరేణిలో పింఛను తీసుకుంటున్నా.. తక్కువ వస్తోందని ఇటీవలే వృద్ధాప్య పింఛన్​ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయంపై నస్పూర్​ పురపాలిక అధికారులను సంప్రదించగా అతను మరణించినట్లు రికార్డుల్లో నమోదైనట్లు ఓ పత్రం అతని చేతికిచ్చారు. ఈ సంఘటనపై మున్సిపల్​ కమిషనర్​ రాజలింగును చరవాణి ద్వారా వివరణ కోరగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి : సభ్యత్వ నమోదులో పొరపాట్లు చేయొద్దు: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.