ETV Bharat / state

వరి ధాన్యం కొనుగోలులో జాప్యంతో రైతు ఆత్మహత్యాయత్నం

author img

By

Published : May 19, 2020, 6:24 PM IST

Updated : May 19, 2020, 6:32 PM IST

ఆరుగాలం కష్టపడి రైతులు పంటను పండిస్తే... తీరా ధాన్యం అమ్మేందుకు రైతులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. మంచిర్యాల జిల్లా నెల్కివెంకటాపూర్​లో నెల రోజులైనా తన పంట కొనుగోలు చేయలేదని ఎద్దు బుచ్చన్న అనే రైతు ఆవేదన చెందాడు. డబ్బులు ఇస్తేనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పడంతో ఆ రైతు మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడు.

45 days to bring grain Farmers suicide attempt at nelki venkatapur
ధాన్యం తీసుకొచ్చి 45 రోజులు.. కొనలేదని రైతు ఆత్మహత్యాయత్నం

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ గ్రామంలో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేయడంలో జాప్యాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఎద్దు బుచ్చన్న అనే రైతు... పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. ధాన్యం కొనుగోలుకు రెండు వేల రూపాయలు డిమాండ్ చేయడం వల్ల ఆవేదన చెందిన బుచ్చన్న ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితున్ని మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

దీంతో అధికారుల తీరును నిరసిస్తూ... రైతులు జాతీయ రహదారిపై సుమారు 2 గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో... ఆందోళన విరమించారు.

వరి ధాన్యం కొనుగోలులో జాప్యంతో రైతు ఆత్మహత్యాయత్నం

ఇదీ చూడండి : 'కమీషన్ల కోసం 4 జిల్లాలను ఎండబెడుతున్నారు'

Last Updated : May 19, 2020, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.