మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కల్యాణికని ఉపరితల గని ఆవరణలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం ముఖ్య అతిథిగా హాజరై... కార్యక్రమాన్ని ప్రారంభించారు. బలరాం ఒక్కడే స్వయంగా 360 మొక్కలు నాటి కార్మికుల్లో స్ఫూర్తి నింపారు. కోటి మొక్కలను నాటే లక్ష్యంతో సింగరేణి సిబ్బంది కృషి చేయాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో సింగరేణి ముందు ఉంటుందని నిరూపించాలని బలరాం సూచించారు.
ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్ కల్యాణ్